మహేష్, కీర్తి సురేష్ నెంబర్ 1

మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది కరోనా వల్ల అందరి జీవితాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక సినిమాలకు అయితే ఇది మరింత బ్యాడ్ ఇయర్ అని చెప్పవచ్చు. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటం, షూటింగ్‌లు బంద్ కావడంతో సినీ సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయినా ట్విట్టర్‌లో హీరోలు, హీరోయిన్ల గురించి చర్చ జరిగింది. వారి సినిమాలకు సంబంధించిన వివరాలు ట్విట్టర్‌లో బాగానే ట్రెండ్ అయ్యాయి.

MAHESHBABU

2020లో బాగా ట్రెండ్ అయిన హీరోలు, హీరోయిన్ల వివరాలతో ఒక జాబితాను తాజాగా ట్విట్టర్‌ వెల్లడించింది. సౌత్ ఇండియాకి సంబంధించి ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి స్థానంలో ఉండగా.. పవన్ కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 4వ స్థానాల్లో ఉన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఐదవ స్థానంలో ఉండగా.. అల్లు అర్జున్ ఆరో స్థానంలో ఉన్నాడు.

ఇక రాంచరణ్ ఏడో స్థానంలో ఉండగా.. తమిళ హీరో ధనుష్ 8వ స్థానంలో ఉన్నాడు. తొమ్మిదో స్థానంలో మలయాళ నటుడు మోహన్ లాల్, పదో స్థానంలో చిరంజీవి ఉన్నాడు. అటు హీరోయిన్లలో మహానటి కీర్తి సురేష్ అగ్రస్థానంలో నిలిచింది. కాజల్ రెండో స్థానంలో, సమంత మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో రష్మిక, ఐదో స్థానంలో పూజాహెగ్దే ఉన్నారు.