సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సినిమాలతో పాటు అక్కినేని కోడలు సమంత ఓటీటీలో కూడా ప్రేక్షకులను పలకరిస్తోంది. ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా యాప్‌లో సామ్ జామ్ అనే టాక్ షోను సమంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే సినీ రంగం నుంచి అల్లు అర్జున్, తమన్నా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, దగ్గుబాటి రానా, డైరెక్టర్ నాగ్ అశ్విన్, రకూల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ క్రిష్‌లను ఇంటర్వ్యూ చేసింది. ఇక క్రీడా రంగం నుంచి సైనా నెహ్వాల్, పరుపల్లి కశ్యప్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

samantha

ఈ షో హోస్ట్ చేయడానికి సమంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లకు గాను సమంత కోటి రూపాయలు రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సమంత రెమ్యూనరేషన్ వార్త విని టాలీవుడ్ హీరోయిన్స్, ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. యాంకర్లు అయితే ఈ వార్త విని అవాక్కవుతున్నారు. సమంతకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా కుర్రాళ్ల ఫాలోయింగ్ సమంతకు బాగా ఉంది.

దానిని దృష్టిలో పెట్టుకునే సమంతకు ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతకుముందు దసరా రోజున హోస్ట్ చేసిన బిగ్‌ బాస్ -4 ఒక్క ఎపిసోడ్‌కు సమంత రూ.40 లక్షలు పైనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ షోకు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి. తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను సమంత ఫిదా చేసింది. దీని ద్వారా సమంతలో ఉన్న మరో టాలెంట్ బయటపడింది.