ఓ సరికొత్త పోస్టర్ ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ‘సరిపోదా శనివారం’ టీమ్

దసరా, హాయ్ నాన్న సినిమాలతో పాన్ ఇండియా స్థాయి విజయాల్ని అందుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమా తీయబోతున్నారు. ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదల అయినా టీజర్ కు మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్ లో నాని తో పాటుగా సాయి కుమార్ గారు ఉండటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్, అలాగే ఓ కీలక పాత్రలో ఎస్ జె సూర్య నటిస్తున్నారు. మురళి జి డీవోపీగా చేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. కాగా ఈ చిత్రం ఆగష్టు 29 వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్