సందీప్ రెడ్డి వంగ ‘డెవిల్’లో బాలీవుడ్ స్టార్ హీరో

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఒక సినిమా దాదాపు గంటపాటు గ్లూమీ మూడ్ లో ట్రావెల్ అవ్వడం, హీరో హీరోయిన్ విడిపోయారు అనే విషయం ముందే చెప్పడం జనరల్ గా మన తెలుగు సినిమాల్లో చూడము. సినిమాకి ఈ లెక్కలు ఉండాలి అనే విషయాన్ని పూర్తిగా పక్కకి నెట్టేసిన సందీప్ రెడ్డి వంగ, అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. 2019లో హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయినా కూడా కబీర్ సింగ్ సాధించిన వసూళ్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఘోరమైన నెగటివ్ రివ్యూస్ ని ఫేస్ చేసినా కూడా కబీర్ సింగ్ మూడు వందల కోట్లు రాబట్టడం విశేషం.

sandeep reddy vanga ranbir kapoor

ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి మళ్లీ తెలుగు సినిమా చేస్తాడని, అది కూడా మహేశ్ బాబుతోనే ఉంటుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ సందీప్, బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి డెవిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. కబీర్ సింగ్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు భూషణ్ కుమార్, మురద్ కేతానిలే సందీప్ నెక్స్ట్ సినిమాని కూడా నిర్మించనున్నారు.