పాన్ ఇండియా మొత్తం మహేష్ నామస్మరణ

రాజమౌళి, శంకర్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియా డైరెక్టర్స్ విలువని నార్త్ లో నిలబెట్టిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తే చాలు. ముఖ్యంగా రాజమౌళి, శంకర్ లతో సినిమాలు చేస్తే చాలు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ వచ్చినట్లే. అందుకే సౌత్ స్టార్ హీరోస్ కూడా వీళ్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరి దర్శకులతో సినిమా చేయకున్నా ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న ఈ జనరేషన్ తెలుగు హీరో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు మాత్రమే.

మహేష్ బాబు సినిమాలని రీమేక్ చేసి తమిళ హీరో విజయ్ ఇళయదలపతి అయ్యాడు. పోకిరి సినిమా చేసి సల్మాన్ ఖాన్ వాంటెడ్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ ని అడిగినా మహేష్ బాబుతో వర్క్ చేయాలని ఉంది అంటారు. ఇప్పటికే మహేష్ తో సినిమా చేయాలని బాలీవుడ్ మేకర్స్ కూడా చాలా సార్లు ట్రై చేశారు కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. అయితేనేం మహేష్ రికార్డులు కొట్టడం మాత్రం ఆపలేదు. రాజమౌళితో సినిమా చేయకుండా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరో మహేష్ మాత్రమే. పాన్ ఇండియా సినిమా చేయకున్నా ఫేమ్ తెచ్చుకున్న మహేష్ బాబు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు. ఇదే జరిగితే పాన్ ఇండియా మొత్తం మహేష్ నామస్మరణ జరుగుతుంది.