నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు

అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో పాటు టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. పెళ్లి తర్వాత సమంతకు అవకాశాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సమంత చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా సమంత నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ సమంత రెచ్చిపోతోంది.

samantha about trolls

అయితే సమంత హాట్ ఫొటోలు పెట్టడంపై కొంతమంది నెటిజన్లు విమర్శలు కూడా చేశారు. కానీ సమంత వాటిని ఏం పట్టించుకోవడం లేదు. ఇటీవల తన డిజైనర్ ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టుకుని సోఫాలో హాయిగా ముచ్చట్లు పెడుతున్న ఫొటో ఇటీవల సమంత షేర్ చేసి వెంటనే డిలీట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్‌పై స్పందించిన సమంత.. తాను ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని అని.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి చూస్తుంటే నవ్వొస్తుంటుందన్నారు.