వైరల్‌గా మారిన కీర్తి సురేష్ ‘సర్కారు వారి పాట’ లుక్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారువారి పాట’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇందులో పాల్గొనేందుకు మహేష్, కీర్తి సురేష్ దుబాయ్ చేరుకున్నారు. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో కీర్తి సురేష్ కాస్టూమ్స్‌తో ఉన్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

keerty suresh look

ఇందులో ఆమె బూడిద ,బంగారు ముద్రిత కలిగిన లేత గులాబీ రంగు చీర ధరించి ఉంది. ఆమె జట్టు పూలతో నిండి ఉంది. ఈ ఫొటోలో 10 మంది మాస్కులు పెట్టుకుని కనిపించారు. సినిమా యూనిట్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఈ ఫొటోలో ఉంది. ఈ సినిమా మెజార్టీ షూటింగ్ దుబాయ్‌లోనే నిర్వహించనున్నారు.