RRR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై మండిప‌డుతున్న బోనీక‌పూర్‌!

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇటీవ‌లే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. అక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా RRRఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు రాజ‌మౌళి తీసుకున్న నిర్ణ‌యంపై బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ మండిప‌డుతున్నాడ‌ట‌. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుండ‌గా..

RRR-Mydhan Movies issue

RRR బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ హిందీలో మైదాన్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. లెజండ‌రీ ఫుట్‌బాల్ ఆట‌గాడు స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హిత్ జీవిత ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్, ప్రియ‌మ‌ణి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 15న రిలీజ్ అవుతుంద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే తీరా చూస్తే RRRఆర్ఆర్ఆర్ చిత్రం అదే స‌మ‌యానికి రిలీజ్ అవుతుండ‌డంతో బోనీ క‌పూర్ మండిప‌డుతున్నాడ‌ట‌. ఇలా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం ఏమీ బాగాలేదు.. ఇది అన్యాయం అన్నారాయ‌న‌.. మ‌రి దీనిపై RRR ఆర్ఆర్ఆర్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ‌‌ ‌‌