Pradeep: 30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా చిత్రంపై ఎంతో భ‌య‌పడ్డా: ప‌్ర‌దీప్ మాచిరాజు

Pradeep: బుల్లితెర‌పై యాంక‌ర్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపా‌దించుకున్న ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌య మ‌వుతున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా. ప్ర‌దీప్ స‌ర‌స‌న అమృత అయ్యార్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 29న థియేట‌ర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు డైరెక్ట‌ర్స్ అనిల్ రావిపూడి, మారుతి, హీరోలు అడివి శేషు, కార్తికేయ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

pradeep machiraju

Pradeep ఈ సంద‌ర్భంగా ప్ర‌దీప్ మాచిరాజు మాట్లాడుతూ.. యాంక‌ర్‌గా ఎన్నో వేడుక‌ల్లో నేను స్టేజ్‌పై నిల్చొని హీరోహీరోయిన్ల‌ను వేదిక‌పైకి ఆహ్వానిస్తూ ఉండేవాడిని.. మొద‌టిసారి హీరో ప్ర‌దీప్ అని న‌న్ను స్టేజ్ మీద‌కు ఆహ్వానించ‌గానే నాకెంతో భ‌యంగా అనిపించింది. ఇన్నాళ్లు బుల్లితెర‌పై త‌న‌ను ఆద‌రించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అన్నాడు. అలాగే ఈ సినిమా మొద‌ల‌వుతున్న‌పుడు త‌న‌లో ఆనందం, భ‌యం, సంతోషం క‌లిగాయ‌ని చెప్పాడు Pradeep. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మున్నా ఈ మూవీతో ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. మున్నా త‌న‌కు అన్న లాంటివాడ‌ని.. మున్నా అన్న అస‌లు పేరు కూడా ప్ర‌దీపే. Pradeep మేమిద్ద‌రం క‌లిసి మ‌రెన్నో సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు Pradeep. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ గారు త‌న‌కు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాట ఇచ్చాడ‌ని, చిత్ర‌యూనిట్ మొత్తం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశార‌ని తెలుపుతూ ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపాడు ప్ర‌దీప్‌ Pradeep. ఇక ఈ చిత్రాన్ని ఎస్‌.వి.బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.వి.బాబు నిర్మిస్తుండ‌గా.. భారీ నిర్మాణ సంస్థ‌లు అయినా గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కానుంది.