Salaar: నేడు శ్రుతిహ‌స‌న్ బ‌ర్త్‌డే.. ప్ర‌భాస్ విషేస్ తెలుపుతూ.. స‌లార్‌లోకి ఆహ్వానం!

Salaar: బాహుబ‌లి ప్ర‌భాస్‌, కేజీఎఫ్ ఫేం డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా అవ‌కాశం క‌ల్పించారు చిత్ర‌బృందం. ఈ క్ర‌మంలో స‌లార్ టీమ్‌లోకి శ్రుతిని ఆహ్వానిస్తూ.. ఆమె ఉన్నా ఫోటోను తాజాగా పోస్ట్ చేసింది చిత్ర‌బృందం. గురువారం శ్రుతి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా Salaar స‌లార్ మూవీ టీం ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

salaar updates

ఎంతో అంద‌మైన శ్రుతిహాస‌న్‌కు బ‌ర్త్ డే విషేస్ అంటూ.. ఈ Salaarమూవీలో భాగ‌మైనందుకు ఎంతో ఆనందిస్తున్నామ‌ని చిత్ర‌యూనిట్ పేర్కొంది. అదేవిధంగా Salaarప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రుతిహాస‌న్‌కు బ‌ర్త్‌డే విషేస్ తెలిపుతూ..లుకింగ్ ఫార్వ‌ర్డ్ టు వ‌ర్క్ విత్ యూ ఆన్ Salaarస‌లార్ అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్ తోనే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసిన మేక‌ర్స్‌.. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూట్ జ‌న‌వ‌రి 29నుంచి మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం కాగా.. ఈ మేర‌కు రామ‌గుండంలోని సింగ‌రేణి బోగ్గు గ‌నిలో ఈ Salaar చిత్ర భారీ సెట్ వేసిన‌ట్లు తెలుస్తోంది.