బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్ధమైన ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ త్వరలో పెళ్లి పీటలెక్కనుందనే వార్తలొస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ అయిన రోహన్ శ్రేష్ఠను త్వరలో శ్రద్ధాకపూర్ పెళ్లాడనుందని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్‌లో ఉండగా.. గత ఏడాది పెళ్లి చేసుకుంటారని వార్తలొస్తున్నాయి. కానీ లాక్‌డౌన్ రావడంతో ఆగిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు శ్రద్ధాకపూర్-రోహన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

shardda kapoor marriage

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన గర్ల్‌ఫ్రెండ్ అయిన నటాషాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతుూ రోహన్ శ్రేష్ఠ ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన వరుణ్.. త్వరలో నువ్వు కూడా లక్కీ గై అయ్యేందుకు రెడీగా ఉండు అని సమాధానం ఇచ్చాడు. దీంతో త్వరలో శ్రద్ధా కపూర్-రోహన్ మ్యారేజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది.