మనం-2కి ప్లాన్.. ఈ సారి ఆ ఇద్దరు హీరోలు కూడా..

తెలుగులో మనం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఈ సినిమాలో నటించగా.. టాలీవుడ్‌లో ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని సినిమాగా ఇది నిలించింది.

planing for manam 2

దీంతో మనంకి సీక్వెల్ తీయాలని డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జునకు కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో థ్యాంక్యూ అనే సినిమాను విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత మనం సీక్వెల్ మొదలకానుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ మొత్తం సిద్ధం అయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సారి నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తో పాటు సుశాంత్, సుమంత్ కూడా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.