Tollywood: ఇన్నాళ్ల త‌ర్వాత‌ మంచు హీరోతో మెగా హీరో..

Tollywood: మెగాస్టార్ చిరంజీవి- డైలాంగ్ మోహ‌న్‌బాబు అప్ప‌ట్లో వీరి కాంబినేష‌న్ చిత్రాలు సంచ‌ల‌నం. వీరి కాంబోలో సినిమా వ‌స్తుందంటే సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి ఉంటుంది.. అంత‌లా వీరిద్ద‌రు న‌ట‌న‌లో పోటీ ప‌డుతుంటారు. కానీ అప్ప‌ట్లో ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థాలు నెల‌కొన్నాయి.. దీంతో వీరి కాంబో చిత్రాలు ఇప్ప‌టివ‌ర‌కు రాలేక‌పోయాయి.. కానీ మంచు ఫ్యామీలి, మెగా ఫ్యామిలీ మాత్రం ఎంతో స‌న్నిహితంగా ఉంటారు.. ఈ నేప‌థ్యంలోనే మంచు వారి సినిమాలో మెగా హీరో న‌టించ‌నున్నార‌ట‌.. వివ‌రాల్లోకి వెళితే..

Mega-manchu

మంచు మ‌నోజ్ స్వీయ నిర్మాణంలో న‌టిస్తున్న చిత్రం అహం బ్ర‌హ్మాస్మి. శ్రీ‌కాంత్ ఎన్‌.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌నోజ్ వైవిధ్య‌మైన లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం మెగా అల్లుడు సాయి తేజ్ ను అడిగార‌ట‌. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి మ‌నోజ్‌తో స్నేహం ఉండ‌డంతో ఆయ‌న అడిగిన వెంట‌నే సినిమాలో న‌టించేందుకు సాయి తేజ్ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.. ప్ర‌స్తుతం ఈ వార్తా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.