Mega Hero: టాలీవుడ్‌లో గుర్తింపు లేదు.. బాలీవుడ్‌లోకి అల్లుఅర్జున్ బ్ర‌ద‌ర్‌!

Mega Hero: స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాదు త‌మిళ్‌, హిందీ, మ‌రీ ముఖ్యంగా మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఆయ‌న న‌టించిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.. అయితే ఆయ‌న స్టార్‌డ‌మ్‌లో కొంత భాగ‌మైన తెచ్చుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు ఆయ‌న బ్ర‌ద‌ర్ అల్లు శిరీష్. టాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు న‌టించిన‌ప్ప‌టీకీ గుర్తింపు రాలేదు.. అన్న‌య్య‌కు త‌గ్గ త‌మ్ముడిగా క‌ష్ట‌ప‌డుతున్నాడే కాని పేరు మాత్రం రావ‌ట్లేదు.. కాగా తాజాగాMega Hero అల్లుశిరీశ్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఫ‌స్ట్ టైం హిందీ మ్యూజిక్ ఆల్బ‌మ్‌లో ఓ ఐటెంభామ‌తో చిందేశాడు శిరీష్.

Allu

విలాయ‌టి శ‌రాబ్ అనే రూపొందించిన ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ హీలీ దారూవాలాతో క‌లిసి అల్లు శిరీష్ స్టెప్పులు వేశాడు. ఇందులో అల్లు శిరీష్ ఆటో డ్రైవ‌ర్‌గా కనిపించాడు. ఈ సాంగ్‌కు ఆదిల్ షేక్ కొరియోగ్ర‌ఫీ చేయ‌గా.. లిజో జార్జ్, డిజె చేటాస్ క‌లిసి ఈ పాట‌కు ట్యూన్ కంపోజ్ చేశారు. సింగ‌ర్స్ ద‌ర్శ‌న్ రావ‌ల్‌, నీతి మోహ‌న్ ఈ సాంగ్‌ను ఆల‌పించారు. కుమార్ ఈ సాంగ్‌కు లిరిక్స్ అందించ‌గా.. Mega Hero అల్లు శిరీష్‌కు ఈ మ్యూజిక్ ఆల్బ‌మ్ ఎలాంటి గుర్తింపు తీసుకువ‌స్తుందో వేచి చూడాలి మ‌రీ.