‘క్రాక్’ ట్విట్టర్ రివ్యూ… హిట్టా?.. ఫట్టా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల మార్నింగ్ షో రద్దవ్వగా.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం 11 గంటలకు షో ప్రారంభమైంది. మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఇంకా సినిమా విడుదల కాలేదు. మధ్యాహ్నం నుంచి మల్టీఫ్లెక్స్ థియేటర్లలో కూడా సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. సినీ జర్నలిస్టుల కోసం రాత్రి ప్రీమియర్ షో వేశారు.

KRACK TWITTER REVIEW

దీంతో సినిమా టాక్ బయటికొస్తుంది. సినీ జర్నలిస్టులు ట్విట్టర్‌లో సినిమా రివ్యూ రాస్తున్నారు. ఎక్కువమంది పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. రవితేజ, విలన్స్ మధ్య సీన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని, యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెబుతున్నారు. ఇక రొమాంటిక్ సీన్లు కూడా చాలా బాగా ఉన్నాయట. మొత్తానికి ట్విట్టర్ రివ్యూలు అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.