త‌న సీ‌మంతం వేడుక‌ల్లో డ్యాన్స్ చేసిన హ‌రితేజ!

బిగ్‌బాస్‌-1 కంటెస్టెంట్‌, న‌టి, యాంక‌ర్ హ‌రితేజ గురించి ప్ర‌త్యేక ప‌రిచయం అక్క‌ర్లేదు. ఆమె అతి త్వ‌ర‌లోనే బిడ్డ‌కు జ‌న్మ‌ను ఇవ్వ‌బోతున్నారు. ఇటీవ‌లే ఆమె కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు స‌మ‌క్షంలో సీమంతం జ‌రిగింది. కాగా ఈ వేడుక‌ల్లో త‌న స్నేహితురాలు హిమ‌జ‌తో క‌లిసి సంద‌డి చేశారు. మామూలుగా హ‌రితేజ చాలా యాక్టివ్‌గా ఉంటారనే విష‌యం తెలిసిందే. ఇక త‌న సీమంతం వేడుక‌లో చిన్న చిన్న స్టెప్పులు వేసి అంద‌రిని ఆక‌ర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్‌మీడియాలో హ‌రితేజ షేర్ చేశారు.

BIG BOSS HARITEJA SEEMANTHAMA

దీంతో నిండు గ‌ర్బిణి అయినా కూడా ఆమె స్టెప్పులు వేయ‌డం ఆమె ఎన‌ర్జీకి నిద‌ర్శ‌నం అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌ 2016లో దీప‌క్‌రావుని వివాహ‌మాడిన హ‌రితేజ‌.. కెరీర్ ప‌రంగా బిజీ అయ్యింది. తొలుత సీరియ‌ల్స్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు చేరువై 2017లో బిగ్‌బాస్-1 కంటెస్టెంట్‌గా అల‌రించి టాప్‌-3 కంటెస్టెంట్‌గా నిలిచింది. అనంత‌రం వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌ను అందిపుచ్చుకుంది. ఈనేప‌థ్యంలో రాజా ది గ్రేట్‌, హిట్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, ప్ర‌తిరోజు పండ‌గే, ఎఫ్‌-2, అర‌వింద స‌మేత‌, ప‌లు సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు హ‌రితేజ‌.