పవన్ సినిమా నుంచి తప్పుకున్న రానా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతుండగా.. పవన్‌తో పాటు శృతిహాసన్ ఇందులో పాల్గొంటోంది. త్వరలో ఈ షూటింగ్ ముగిసే అవకాశముండగా.. సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేదా ధామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

rana

తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో రీమేక్ కాబోతున్న మలయాళ ‘అయ్యప్పనమ్ కోషియమ్’ సినిమాలో పవన్ నటించనున్నాడు. సాగర్ కె.చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా.. సితార ఎంటర్‌టైన్‌మ్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇందులో నిజాయితీగల పోలీస్ పాత్రలో పవన్ నటించనుండగా.. పృథ్వీరాజ్ నటించిన పాత్రలో రానా నటించాల్సి ఉంది.

కానీ ఈ సినిమా నుంచి రానా తప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగు రీమేక్‌లో పవన్ పాత్రను ఎక్కువగా హైలెట్ చేసి రానా పాత్రను బాగా తగ్గించారట. దీంతో రానా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరో హీరోను తీసుకునేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.