కేజీఎఫ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే వార్త

కేజీఎఫ్ అభిమానులకు సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ తెలిపింది. కేజీఎఫ్-2 టీజర్‌ను జనవరి 8న ఉదయం 10.18 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజు హీరో యశ్ పుట్టినరోజు కావడంతో.. టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హుంబుల్ ఫిల్మ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ టీజర్ రిలీజ్ చేయనున్నారు. కేజీఎఫ్-1కు కొనసాగింపుగా కేజీఎఫ్-2ను తెరకెక్కించారు. కేజీఎఫ్-1 సూపర్ హిట్ కావడంతో.. కేజీఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఇందులో హీరోగా నటించగా.. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశాడు.

KGF

కేజీఎఫ్-2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటించడంతో.. ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు నిన్ననే ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. యశ్‌తో పని చేయడం ఎప్పటిలాగే ట్రీట్ అని, సంజయ్ దత్ నిజమైన వారియర్ అని ప్రశాంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. థియేటర్లలోనే కేజీఎఫ్ 2 విడుదల చేయనున్నట్లు చెప్పాడు.

హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో గత కొద్దిరోజులుగా క్లైమాక్స్ సీన్లను తెరకెక్కించారు. ఈ షూటింగ్‌లో హీరో యశ్‌తో పాటు సంజయ్ దత్ పాల్గొన్నారు. క్లైమాక్స్ సీన్లు ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.