అభిమాని డైరెక్షన్‌లో బాలయ్య సినిమా

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘BB3’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. ఈ మూడో సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు.

BALAYYA

కానీ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. ఇటీవలే వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయని, బాలయ్య కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో కూడా బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి చాలా ప్రయత్నాలు చేశాడు. కాని కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

ఈ ఏడాది మహేష్‌తో తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి ‘F3’ తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తైన తర్వాత బాలయ్యతో సినిమా ఉంటుందని టాక్. 2022 సంక్రాంతికి బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. తాను బాలయ్యకు పెద్ద అభిమానిని అని, ఆయనతో సినిమా తీయాలని ఉందని పలు ఇంటర్వ్యూలలో అనిల్ రావిపూడి చెప్పాడు. ఇప్పుడు ఎట్టకేలకు తన అభిమాన హీరో బాలయ్యతో సినిమా చేసే అవకాశం దక్కినందుకు అనిల్ హ్యాపీగా ఉన్నాడు.