‘సామ్ జామ్‌’కు కాబోయే బిగ్‌బాస్ విన్నర్?

అక్కినేని కోడలు సమంత ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా యాప్ కోసం ‘సామ్ జామ్’ పేరుతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు పలువురు సెలబ్రెటీలను తీసుకొచ్చి సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే చిరంజీవితో పాటు తమన్నా, అల్లు అర్జున్, రానా, నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ హాజరై సందడి చేశారు. తన ఇంటర్వ్యూలో సెలబ్రెటీల నుంచి ఆసక్తికర విషయాలను సమంత బయట పెట్టించింది. దీంతో ఈ షో బాగా పాపులర్ అయింది.

ABHIJIT

అయితే ఈ షోకు కాబోయే బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ కూడా రానున్నాడని సమాచారం. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుండగా.. అభిజిత్ విన్నర్ కావడం ఖాయమని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌లో కూడా అభిజిత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ ఓట్లు అన్నీ కలిపితే.. దాదాపు 50 శాతం ఓట్లు అభిజిత్‌కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో అభిజిత్ విన్నర్ కావడం ఖాయమని వార్తలొస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే ‘సామ్ జామ్’ షోలో అభిజిత్ పాల్గొననున్నాడని టాక్. ఇప్పటికే ‘సామ్ జామ్’ షో నిర్వాహకుల నుంచి అభిజిత్‌కు ఇన్విటేషన్ వచ్చినట్లు చెబుతున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ మీడియా ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అభిజిత్ ఏకంగా సమంతకు ఇంటర్వ్యూ ఇవ్వనున్నాడన్న మాట.