100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాలో మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది అయ్యాక మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ లో చరణ్ కనిపించే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్ పై చరణ్ లూసిఫర్ రైట్స్ కొన్నాడు.

ram charan

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తమిళ సినిమా రీమేక్ చేసేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం. తమిళంలో ఈ మధ్య విడుదలైన అసురన్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకి మహేశ్ బాబు, కరణ్ జోహార్ లాంటి వాళ్లు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కుర్రాడిగా, తండ్రిగా గ్రామీణ యువకుడిగా చాలా వేరియేషన్స్ చూపించిన ధనుష్, అసురన్ సినిమాతో ఈసారి నేషనల్ అవార్డ్ గెలుచుకోవడం ఖాయం అనే మాట కూడా వినిపిస్తోంది. వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగులో చేయాలని చరణ్ భావిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అయితే రంగస్థలం లాంటి సినిమాలో పల్లెటూరి కుర్రాడిగా ఆల్రెడీ కనిపించిన చరణ్, మళ్లీ అదే లుక్ లో కనిపించే ప్రయత్నం చేస్తాడా అనే ఇప్పట్లో కష్టమనే సమాధానం వస్తుంది. పైగా రాజమౌళి సినిమా తర్వాత చరణ్ అండ్ ఎన్టీఆర్ ల మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. అలాంటి సమయంలో చరణ్ 40 ఏళ్ల వ్యక్తిగా, ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపిస్తాడా అంటే కష్టమనే చెప్పాలి. ఒకవేళ చరణ్ అసురన్ రైట్స్ కొన్నా అందులో నటించే అవకాశాలు మాత్రం చాలా తక్కువ.