కమాండో 3 కోసం భావనా రెడ్డిగా మారిన హార్ట్ ఎటాక్ బ్యూటీ

పూరి తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో యూత్ కి నిజంగానే హార్ట్ ఎటాక్ ఇచ్చిన బాలీవడ్ బ్యూటీ ఆదా శర్మ. విధ్యుత్ జంవాళ్ తో కలిసి అదా నటిస్తున్న సినిమా కమాండో. ఇప్పటికే ఈ కమాండోకి సీక్వెల్ గా కమాండో 2 వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అదా శర్మ భావనారెడ్డి పాత్రలో నటించింది. సీక్వెల్‌ నుంచి మంగళవారం అదా శర్మ లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో ఆమెది తెలుగమ్మాయి పాత్ర. ”ది నేమ్‌ ఈజ్‌ రెడ్డి! భావనారెడ్డి! రెండు రోజుల్లో తనను చూడటానికి మీరు సిద్ధమా? రెండు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్‌లో తను ఉంటుంది” అని అదా శర్మ ట్వీట్ చేసింది. నవంబర్‌ 29న ఈ సినిమా విడుదల కానుంది.