చుల్ బుల్ పాండేకి గ్రాండ్ గా స్వాగతం చెప్పండి…

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దబాంగ్ 3. దబాంగ్ సిరీస్ లో భాగంగా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ ని రిలీజ్ చేశారు. చుల్ బుల్ పాండేగా సాల్మన్ ఖాన్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టున్నాడు. దబాంగ్ సినిమా రిలీజ్ అయ్యి ఏళ్లు దాటుతున్నా సల్మాన్ అదే లుక్ ని మైంటైన్ చేయడం గొప్ప విషయం. ఎండ్ సీన్ సల్మాన్ సిక్స్ ప్యాక్ చూపించబోయే లోపు ట్రైలర్ కట్ అయ్యింది.

మొదటి సినిమా నుంచి అలానే కంటిన్యూ అవుతున్న సోనాక్షి కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకుంది. సైయీ మంజ్రేకర్ డెబ్యూ ఫిలింలోనే తన లుక్స్ తో మెప్పించేలా కనిపిస్తోంది. ఇక విలన్ గా కనిపించిన సౌత్ స్టార్ కిచ్చా సుదీప్, మంచి స్కోప్ ఉన్న రోల్ చేశాడు. ఫ్యూచర్ లో సుదీప్ మరిన్ని హిందీ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ప్రభుదేవా తెరకెక్కిస్తున్న దబాంగ్ 3 ని డిసెంబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.