మార్పులు హరీష్ శంకర్, మాటలు త్రివిక్రమ్… సినిమా పింక్

పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రానున్నాడని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని అంతా అనుకుంటున్నారు. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాని, ఇప్పటికే తమిళ్లో అజిత్ తో రీమేక్ చేసి బోనీ కపూర్ హిట్ కొట్టాడు. ఇదే సినిమాని ఇప్పుడు దిల్ రాజుతో కలిసి తెలుగులో నిర్మించడానికి రెడీ అయ్యాడు. పవన్ ని ఒప్పించే పనిలో దిల్ రాజు బిజీగా ఉన్నాడు.

pawan kalyan harish shankar trivikram

ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఓకే అంటే డైరెక్ట్ చేయడానికి హరీష్ శంకర్ పింక్ సినిమాకి కావాల్సిన మాటలు మార్పులు చేస్తున్నాడని సమాచారం. అయితే పవన్ రీఎంట్రీని ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు. పింక్ సినిమాని తెలుగులో రీమేక్ కి చేస్తే దానికి హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా, డైలాగ్స్ ని మాత్రం త్రివిక్రమ్ రాయనున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అవ్వడం… త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకోని దిల్ రాజు ఈ ప్లాన్ వేస్తున్నాడట. గతంలో పవన్ నటించిన తీన్మార్ సినిమాకి కూడా త్రివిక్రమ్ మాటలు రాశాడు. ఇవి సినిమానే నిలబెట్టే స్థాయికి వెళ్లాయి. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.