బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్

నందమూరి నటిసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న BB3లో హీరో రాజశేఖర్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాల్లో విలన్ రోల్‌కు మరో హీరోను ఎంపిక చేస్తున్నారు. గతంలో లెజెండ్ సినిమాలో జగబతిబాబును విలన్‌గా పెట్టగా.. ఇప్పుడు BB3లో కూడా విలన్‌గా మరో హీరోను బోయపాటి దింపుతున్నాడట.

BALAKRISHNA

BB3లో బాలయ్య ఓల్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఆ ఓల్డ్ క్యారెక్టర్‌లో బాలయ్యకు విలన్‌గా రాజశేఖర్‌ని తీసుకోవాలని బోయపాటి భావిస్తున్నాడట. ఇటీవల కరోనా నుంచి రాజశేఖర్ కోలుకోవడంతో… త్వరలోనే ఈ షూటింగ్‌లో పాల్గొనే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

లాక్‌డౌన్ తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. త్వరలోనే బాలయ్య షూటింగ్‌లో పాల్గొనన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ఇంకా జరుగుతూనే ఉంది.