వినాయక్‌కి షాకిచ్చిన చిరు.. మరో డైరెక్టర్‌కి ఛాన్స్?

ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా.. ఈ సినిమా తర్వాత ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నాడు. అయితే ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ సినిమాను వి.వి.వినాయక్ తెరకెక్కిస్తాడని గతంలో వార్తలొచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు భారీ విజయం సాధించాయి. దీంతో వినాయక్ అయితే బాగా తెరకెక్కిస్తాడనే ఉద్దేశంతో ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌ను ఆయనకు చిరు అప్పగించాడు.

CHIRU

దీంతో కొన్ని రోజుల పాటు ఈ ప్రాజెక్ట్‌పై వర్క్‌వుట్ చేసిన వినాయక్.. చిరు చెప్పిన కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేశాడు. కానీ వినాయక్ చేసిన మార్పులు చిరుకు సంతృప్తి కలిగించలేదట. అందుకని ఈ ప్రాజెక్టు నుంచి వినాయక్‌ను చిరు తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను హరీష్ శంకర్‌కు చిరు అప్పగించినట్లు వార్తలొస్తున్నాయి. హరీశ్ కూడా ఎప్పటినుంచో చిరుతో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఇప్పుడు అవకాశం దక్కడంతో అతడు కూడా హ్యాపీగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది.