కరోనాతో చిరుపై పగ తీర్చుకున్న రాజశేఖర్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడం ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అసలు ఆయనకు కరోనా ఎలా సోకిందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇటీవల హీరో రాజశేఖర్‌కు కరోనా సోకగా.. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొంది మంగళవారమే డిశ్చార్జ్ అయ్యారు.

CHIRU

అయితే రాజశేఖర్‌కు కరోనా సోకిన క్రమంలో చిరు వెళ్లి హాస్పిటల్‌లో ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే. కరోనా సోకిన రాజశేఖర్‌ను కలవడం వల్లే చిరుకు కరోనా సోకిందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.

చిరు, రాజశేఖర్ మధ్య ఎప్పటినుంచే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విబేధాలు ఉన్నాయి. మధ్యలో కొన్నిరోజుల పాటు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడినా.. గతంలో జరిగిన ‘మా’ సమావేశంలో బహిరంగంగా వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవ పెద్ద రచ్చకు దారితీసింది. అప్పటినుంచే చిరు,రాజశేఖర్ మధ్య విబేధాలు అలాగే కొనసాగుతున్నాయి.