ఈ నెల 20న రాబోతున్న ‘అనగనగా ఓ అతిథి’

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా అనగనగా ఓ అతిథి. ఈ నెల 20న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ సినిమా విడుదల కానుంది. థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు దయాల్ పద్మనాభం దర్శకత్వం వహించగా.. రాజా రామమూర్తి నిర్మించారు. చిదంబరం నటేశన్ మ్యూజిక్ అందించాడు.

payal rajput

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘ఆ కలల రాత్రి’ సినిమాకు రీమేక్ ఇది. ఒక ట్రావెలర్ కథను ఈ సినిమాలో చూపించారు. ఒక గుడిసెలో నివాసం ఉంటున్న ట్రావెలర్ డబ్బులు బాగా సంపాదించాలనే అత్యాశతో అనుకోని పనులు చేస్తాడు. ఆ తర్వాత ఏమౌతుందనేది ఈ సినిమా కథ.

ఈ సినిమాను నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు ‘ఆహా’ యాజమాన్యం ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడగా… నవంబర్ 20న విడుదల చేయనున్నట్లు తాజాగా ‘ఆహా’ యాజమాన్యం ట్విట్టర్‌లో ప్రకటించింది.