డ్రగ్స్ కేసు: జైల్లో తీవ్ర అనారోగ్యంతో హీరోయిన్

కోలీవుడ్‌లో సంచలన రేపిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను పోలీసులు గత కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంజనా కొద్దిరోజుల పాటు జైల్లో ఉండగా.. ఇటీవలే ఆమె బెయిల్‌పై బయటికొచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో సంజనా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకసారి హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించగా.. రెండోసారి కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

ragini dwivedi

పోలీసులు విచారణకు పిలిస్తే వెళ్లాలని షరతు పెట్టింది. దీంతో ఇటీవలే సంజనా బెయిల్‌పై బయటకు రాగా.. మరో హీరోయిన్ రాగిణి ద్వివేది మాత్రం ఇంకా బెంగళూరు పరస్పర అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉంది. అయితే తాజాగా జైల్లో రాగిణి ద్వేవేది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం.

శ్వాసకోశ ఇబ్బందితో రాగిణి ద్వివేది బాధపడుతుందని, ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది. అలాగే తరచూ కడుపునొప్పి వస్తుందట. దీంతో ఇటీవల జైల్లో ఉన్న ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించగా.. అయినా ఆరోగ్యం కుదుటపడలేదట. దీంతో తాజాగా ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని లాయర్ అజ్మల్ పాషా కోర్టును ఆశ్రయించారు.