మహేష్‌ బాబుకు పవన్ ఊహించని గిఫ్ట్

టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. మహేష్ నటించిన ‘అర్జున్’ సినిమా పైరసీ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు పవన్ కల్యాణ్ అందరికంటే ముందు స్పందించి అండగా నిలిచారు. ఇక ఇటీవల పవన్ బర్త్ డే టైమ్‌లో మహేష్ విషెస్ కూడా చెప్పాడు. వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ విషయాలను చూస్తే అర్థమవుతోంది.

mahesh and pawan

వీరిద్దరు త్వరలో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. పవన్, మహేష్ ఎంత క్లోజ్‌గా ఉంటారనే విషయం తాజాగా మరోసారి బయటపడింది. క్రిస్మస్ సందర్భంగా మహేష్, నమ్రతకు పవన్, అన్నా లెజ్నెవా కలిసి గూడీస్‌ను పంపించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వీటిల్లో క్రిస్మస్ డెకార్‌తో పాటు చాక్లెట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

రుచికరమైన క్రిస్మస్ గూడీస్ పంపినందుకు పవన్, అన్నా లెజ్నెవాలకు ధన్యవాదాలు అని నమ్రత తెలిపింది. పవన్, అన్నా లెజ్నెవా నుంచి వచ్చిన ఈ ఊహించని గిఫ్ట్‌ను చూసి మహేష్ సర్‌ప్రైజ్ అయ్యాడు. మహేష్ అంటే పవన్‌కు ఎంత ఇష్టమో కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.