‘సలార్’ రిలీజ్ అప్పుడేనట

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమా ‘సలార్’. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన విజయ్ కిరగందుర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే విడుదలైన ‘సలార్’ ప్రభాస్ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇందులో సిరీయస్ లుక్‌లో గన్ పట్టుకుని ప్రభాస్ కనిపించాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తుండగా.. ఇది పూర్తైన తర్వాత ‘సలార్’ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

salar

జనవరిలో సంక్రాంతి తర్వాత సలార్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశ ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ ముగించాలని మేకర్స్ అనుకుంటున్నారట. వచ్చే దసరాకి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా… ఒక హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకోనున్నారట.

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్… పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. సలార్ కూడా పాన్ ఇండియా సినిమా కాగా.. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. సాహో సినిమాతో బాలీవుడ్‌లో ప్రభాస్ మంచి కలెక్షన్లు సంపాదించుకున్నాడు. దీంతో సలార్ సినిమా హిందీలో సక్సెస్ అయితే ప్రభాస్ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారనున్నాడు.