25 ఏళ్లు పూర్తి చేసుకున్న నిర్మాతల ‘అందరివాడు’

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఉద్యోగి రఘు నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995లో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఆయన జాయిన్ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ హైదరాబాద్‌లో స్టార్ట్ చేసినప్పుడు తొలి ఉద్యోగి ఆయనే కావడం విశేషం. అప్పట్లో ఈ ఆఫీసు చిన్న గదిలో ఉండేది. ఆ ఆఫీసులో మొదలైన ఆయన ప్రయాణం నేటికి దిగ్విజయంగా కొనసాగుతోంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూపర్స్ కౌన్సిల్ ప్రతి అడుగులో ఆయన ఉన్నారు ఇప్పటికీ నిర్మాతలకు తలలో నాలుక లాగా రఘు ఉన్నారంటే ఆయన పనితనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

raghu

నిర్మాతలకు ఏ అవసరం వచ్చినా సహాయం సేయడంలో రఘు ఎప్పుడూ ముందు ఉంటారు. దీంతో నిర్మాతలందూ ఆయనను తమ ఇంట్లో కుటుంబసభ్యుడిలా అనుకుంటారు. నిర్మాతలందరితో సత్సంబంధాలు కలిగి ఉంటూ అందరివాడిలా మన్నలను పొందారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాతతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇక నిర్మాతలందరికీ మెడికల్ ఇన్య్సూరెన్స్ ప్రవేశపెట్టడంలో రఘు కృషి ఎంతోమంది ఉంది.

25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రఘుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సన్మాన సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు పలువురు నిర్మాతలు హాజరై రఘుకు అభినందలు తెలిపారు. ఆయనతో కేక్ కట్ చేయించి గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. కౌన్సిల్‌కు ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు చెబుతూ మరో 25 ఏళ్లు కౌన్సిల్‌లో ఉండాలని కోరుకుంటున్నట్లు నిర్మాతలు చెప్పారు.

ఇక రఘు మాట్లాడుతూ.. రామానాయుడు, దాసరి నారాయణరావు, సి.కల్యాణ్ తనకు గాడ్ ఫాదర్స్ అని, ఈ ముగ్గురికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా తన పాత జ్ఝాపకాలను రఘు గుర్తు చేసుకున్నారు.