తెలుగు ఫిలిం కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘జగన్ మోహన్ రెడ్డి’ జన్మదిన వేడుకలు!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగు ఫిలిం కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత జాన్. బాబు, దర్శకుడు సాగర్, నిర్మాత ప్రసన్న కుమార్, నిర్మాత సి.ఎన్ రావు, నిర్మాత కుళ్లప రెడ్డి సురేష్ బాబు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత జాన్ బాబు మాట్లాడుతూ…
మేము పిలవగానే జగన్ గారి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన సాగర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, నిర్మాత సి.ఎన్. రావు గారికి ధన్యవాదాలు జగన్ గారి ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ మరింత లబ్ది చేకూరుతుంది. కరోన కారణంగా సినిమా పరిశ్రమ బాగా దెబ్బతినింది. ఎపి ప్రభుత్వం సినీ కార్మికుల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనుంది. చిన్న సినిమాలకు రాయితీ ఇవ్వడం లేదు, థియేటర్స్ దొరకడం లేదు జగన్ గారు చిన్న సినిమాలకు ప్రభుత్వము నుండి మరింత సపోర్ట్ అందేలా చూడాలని తెలిపారు.

సాగర్ మాట్లాడుతూ…
సీఎం జగన్ మంచి వ్యక్తి తాను తీసుకొనే నిర్ణయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ …
సినిమా ఇండస్ట్రీకి జగన్ గారు చేస్తున్న మేలు బాగుంది. డిజిటల్ పరికరాలకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది. థియేటర్స్ కు మరింత రాయితీ ఇస్తే బాగుంటుంది. మేము ఆయనను కలిసి ఇవన్నీ అడుగుతాము. నిర్మాతలకు మరింత లబ్ది చేకూరే నిర్ణయాలు ఆయన తీసుకుంటారని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత సి.ఎన్. రావు మాట్లాడుతూ…
సినిమాలో పనిచేసే వారికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పీఎఫ్, డిఐ లు ఉండవు. ఉదయం షూటింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం షూటింగ్ పూర్తి అవుతుంది. వారికి తీరిక ఉండదు. సినిమా మీద ప్రేమతోనే వారు కష్ట పడతారు. ఆంధ్ర ప్రభుత్వం వారికోసం మరిన్ని పథకాలు ప్రవేశ పెడితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

నటుడు, నిర్మాత కుళ్లప రెడ్డి సురేష్ బాబు మాట్లాడుతూ.. దివంగత మాజీ సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో సీఎం జగన్ ఏపీలో పాలన బాగా చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఇటీవల జగన్ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో వరాలు ప్రకటించారని, ఇంకా కొన్ని ప్రకటించాల్సి ఉందన్నారు. జగన్‌లాగే సీఎం కేసీఆర్ కూడా సినిమా ఇండస్ట్రీకి వరాలు ప్రకటించాలని కుళ్లప రెడ్డి సురేష్ బాబు కోరారు. లాక్‌డౌన్ కాలంలో అందరికంటే బాగా ఇబ్బందులకు గురి అయింది సినీ కార్మికులే అని, షూటింగ్‌లు నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 24 గంటలు కష్టపడేది ఒక సినీ కార్మికులేనన్నారు. చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని,. థియేటర్లను ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోవాలని కుళ్లప రెడ్డి సురేష్ బాబు సూచించారు.