షుగరా, కాస్త ఆపుకోండి రా అయ్యా…

ఏం కరోనానో తెలియదు కానీ థియేటర్లు బంద్ అవ్వడంతో ప్రొడ్యూసర్లందరూ తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఇది చాలదు అన్నట్లు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి అంటూ ఎవరికి తోచిన రూమర్ వాళ్లు స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా విడుదల ఎప్పుడో అనే డైలమాలో ఉన్న నిర్మాతలకి, మీ సినిమా ఓటీటీలో వస్తుంది అంట కదా అనే మాటలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. నా సినిమా నాకే తెలియకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని నిర్మాతలు కూడా అనుమాన పడే స్థాయిలో రూమర్లు బయటకి వస్తున్నాయి. నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ విషయంలో కూడా ఇలాంటి వార్తే బయటకి వచ్చింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది.

కరోనా కారణంగా మేకర్స్ వెనక్కి తగ్గారు. దీంతో టక్ జగదీశ్ సినిమా ఓటీటీలో ప్రీమియర్ కాబోతుంది అంటూ ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టింది. అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ప్రొడ్యూసర్ సాహు గారపాటి వరకూ వెళ్లింది. చేసేదేమి లేక సినిమాపై వస్తున్న రూమర్లని ఆపడానికి స్వయంగా ఆయనే బయటకి వచ్చి, అవన్నీ అవాస్తవాలని, నాని సినిమా థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఒక సినిమాపై కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ నుంచి కానీ ప్రొడక్షన్ హౌజ్ నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ఆగండి. పబ్లిసిటీ కావాలి కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేసే పరిస్థితి వస్తే అందరికీ చెప్పే చేస్తారు. #SayNoToFakeNews