ఈసారి ఏం కావాలి అంటుందో?

జ్వరం కావాలా అంటూ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ టీనేజ్ అమ్మాయికి భారీ ఆఫర్స్ వచ్చాయి. ఆచితూచి సినిమాలకి ఓకే చెప్తున్న కృతి మరోసారి మెగా హీరో సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం నానితో శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు-ఇంద్రగంటి కాంబో, రామ్ పోతినేని లింగుస్వామి ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తున్న కృతి ఈ మూడు సినిమాలతో పాటు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉంది.

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా మారుతూ సుప్రీమ్ హీరో సాయితేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ కథ అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కృతి కనిపించే. సుకుమార్ రిఫరెన్స్ తో కృతి షెట్టిని కలిసిన దర్శకుడు, ఆమెకు కథ నెరేట్ చేశాడట. బుచ్చిబాబు లాగే కార్తీక్ సుకుమార్ శిష్యుడు డైరెక్షన్ అవ్వడం, మెగా హీరోతో ఛాన్స్ కావడంతో కృతి ఈ ప్రాజెక్ట్ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అన్నీ సెట్ అయితే తమ్ముడు వైష్ణవ్ తేజ్ కి జ్వరం కావాలా అని అడిగిన కృతి, అన్న సాయి ధరమ్ తేజ్ ని ఏం కావాలని అడుగుతుందో చూడాలి.