హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ‘బుట్టబొమ్మ’ న్యూ ప్లాన్!!

ముంబై నుంచి వచ్చిన హాట్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా ఆఫర్స్ అందుకుంటున్న నటీమణులలో ఒకరు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధమ్ సినిమాతో ఆమె బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది, జూనియర్ ఎన్టిఆర్ అరవింద సమేత వీర రాఘవ, మహేష్ బాబు మహర్షి అలాగే ఈ ఏడాది లో వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా కూడా ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి.

టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ఆ సినిమాలు పూజా హెగ్డేకు బాగానే హెల్ప్ అయ్యాయి. ఇక అతి త్వరలో హైదరాబాద్‌లోనే ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటోంది. ఇక్కడే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉండాల్సి వస్తోంది. అందుకే ఇక్కడే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటోంది. ఇంకా ఈ విషయంపై ఆమె స్పందించలేదు. నెక్స్ట్ ఎక్కువగా ఆమె రాధే శ్యామ్ తో బిజీ కానుంది. ఇక కేకే రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. అలాగే బొమ్మరిల్లు ఫేం భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అఖిల్ అక్కినేనితో కలిసి నటించింది. ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.