‘వకీల్ సాబ్’ అప్డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్రం యూనిట్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి పవన్ వరుసగా సినిమాలు ఒకే చేయడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు పుట్టినరోజు కూడా ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పై అంచనాలు. పెరిగిపోతున్నాయి.

వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చి చాలా కాలమవుతోంది. ఇక ఎట్టకేలకు దిల్ రాజు టీమ్ స్పందించింది. సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ని రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఉదయం 9:09గంటలకు రివీల్ చేయబోతున్నారు. ఇన్ని రోజులు అభిమానులు దీని కోసమే ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ని చూస్తుంటే అర్ధమవుతోంది.