జూనియర్ ‘రాకీ భాయ్’ కి నామకరణం.. పేరేంటో..తెలుసా?

KGF హారో యష్, అలాగే రాధిక పండిట్ వారి కుమారుడికి యతర్వ్ అని పేరు పెట్టారు. నామకరనానికి సంబంధించిన ఒక అందమైన వీడియోను వీడియోను కూడా వారు రిలీజ్ చేయగా ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యష్, కుమారుడిని సోషల్ మీడియాలో వారి అభిమానులు ప్రేమతో రాకీ జూనియర్ అని పిలుచుకుంటారు.

కెజిఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ అందుకున్న యష్ కీ కన్నడ పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అతని భార్య రాధిక పండిట్ శాండల్ వుడ్ పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న నటిమణుల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె సినిమాలకి కాస్త దూరంగా ఉంటూ కుటుంబాని చూసుకుంటోంది. రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక వారి పిల్లలలు ఐరా జూనియర్ రాకీల యొక్క కొన్ని అద్భుతమైన ఫోటోలను వీడియోలను ఆమె నిత్యం అభిమానుల కోసం పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు తన కుమారుడి నామకరణంకి సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ.. జూనియర్ రాఖీకి యతర్వ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.