శాక్రిఫైజ్‌ స్టార్‌ సునిశిత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

సినిమా ఇండస్ట్రీలో తనను చాలా మంది పెద్ద హీరోలు ఎదగనివ్వకుండా తొక్కేశారని ఆరోపణలు చేసిన శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ మరోసారి పోలీసు కేసులు ఎదుర్కొంటున్నాడు. గత కొంత కాలంగా అతను యూ ట్యూబ్ ఛానెల్స్ ల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఇష్టానుసారంగా స్టార్ సెలబ్రెటీస్ పై ఆరోపణలు చేసి కొంతమంది హీరోయిన్స్ తో కూడా ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల అతన్ని కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లను అసభ్య పదజాలంతో దూషించడాని ఇబ్రహీంపట్నం, కీసర పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సునిశిత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. గతంలో కూడా లావణ్య త్రిపాఠి తాను ప్రేమించుకున్నట్లు చెప్పి అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అప్పుడే లావణ్య త్రిపాఠి సన్నిహితుల ద్వారా పోలీసులకు పిర్యాదు చేసింది. ఇక ఇప్పుడు మరో కేసు నమోదవ్వడంతో సునిశిత్ కేసు కోర్టు వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.