ఫేక్ న్యూస్ పై బచ్చన్ సీరియస్

Amitabh Bachchan
Amitabh Bachchan tests positive for coronavirus

తప్పుడు వార్తలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్. ఇటీవల ఆయన కోవిడ్ -19 కారణంగా నానావతి హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. అయితే బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై రోజుకో రూమర్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. ఇక ఇటీవల ఒక నేషనల్ మీడియాలో బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై ఒక వార్త ప్రసారం అయ్యింది.

అమితాబ్ బచ్చన్ కి ఇటీవల నిర్వహించిన కోవిడ్ -19 పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని ఆయన పూర్తిగా కొలుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు అది నిజమని నమ్ముతున్న సమయంలో వెంటనే అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తిగా కొలుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదాని చెబుతూ.. ఇది బాధ్యతారాహితమైనది, ఫేక్ న్యూస్..పూర్తిగా అబద్ధమని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.