హీరోయిన్ ఇంట్లోకి అర్థరాత్రి పోలీసులు.. అసలు ఏమైందంటే?

ప్రముఖ హీరో కమల్‌హాసన్ మాజీ భార్య గౌతమి ఇంట్లో అర్థరాత్రి ఒక తాగుబోతు వీరంగం సృష్టించాడు. గొడదూకి ఇంట్లోకి వచ్చి నానా రభస చేశాడు. దీంతో గౌతమి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తాగుబోతును పోలీసులు పట్టుకున్నారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయగా.. బెయిల్‌పై అతడు బయటికొచ్చాడు.

గౌతమి ఇంట్లో తన అన్నయ్య పనిచేస్తుండటంతో.. అతడిని చూసేందుకు ఈ తాగుబోతు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తాగిన మత్తులో ఇలా గొడదూకి వచ్చాడని, దీంతో కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. గొడదూకి రావడం వల్ల దొంగోడు ఏమోనని సిబ్బంది తమకు ఫిర్యాదు చేయడంతో వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

విచారణలో వాళ్ల అన్న ఇంట్లో పనిచేస్తున్నట్లు తేలిందని పోలీసులు బయటపెట్టారు. తాగిన మత్తులో ఇలా గొడదూకి వచ్చినట్లు తమతో చెప్పాడని పోలీసులు చెబుతున్నారు.