కరోనా ఎఫెక్ట్.. షారుక్ ఇంట్లోకి గాలి రాకుండా జాగ్రత్తలు?

కరోనా వైరస్ రోజురోజుకి మరింత ఎక్కువవుతుండడంతో స్టార్ సెలబ్రెటీస్ లలో కొంత ఆందోళన మొదలైంది. వీలైనంత వరకు చాలా మంది షూటింగ్ ల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక షారుక్ ఖాన్ కూడా తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు. గత కొన్ని నెలలుగా వారు ఇంటి నుంచి బయటకు రావడం లేదు.

ఇక ఇటీవల అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని కరోనా వైరస్ భయాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో ముంబైలో చాలా మంది సెలబ్రెటీస్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక షారుక్ ఖాన్ బంగ్లాకు ప్రస్తుతం ప్లాస్టిక్ షీట్స్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాలి ద్వారా కరోనా వస్తుందనే వాదనను కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలియజేసింది. అందుకే షారుక్ ఖాన్ ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నారనే టాక్ వస్తోంది. అయితే గతంలో కూడా ఇదే విధంగా కవర్స్ అమర్చారు షారుక్. దీని వెనుక మరో కారణం కూడా ఉండవచ్చనే కామెంట్స్ వస్తున్నాయి.