పరాన్నజీవిలో వర్మగా కనిపించబోయేది ఎవరో తెలుసా?

paranna jeevi

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్జీవి పవర్ స్టార్ సినిమాతో సరికొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్జీవి వరల్డ్ లో సినిమాను రిలీజ్ చేయనున్న వర్మ అభిమానులు ఎంత రెచ్చగొడితే అంత లాభం అనేలా ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. ఇక మరోవైపు పవర్ స్టార్ అభిమానుల బ్రాండ్ తో ఆర్జీవికి కౌంటర్ ఇచ్చే విధంగా పరాన్న జీవి అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో వర్మగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో ఆర్జీవిని ఇమిటేట్ చేసి జబర్దస్త్ ద్వారా క్రేజ్ అందుకున్న షకలక శంకర్ ఆర్జీవిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. TNR, కత్తి మహేష్, టీవీ9 జాఫర్ కూడా పరాన్న జీవిలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.