Powerstar: దివంగ‌త ఎస్పీ బాలు “ప‌ద్మవిభూష‌ణ్”‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హ‌ర్షం!

Powerstar: ప్ర‌ముఖ గాన గంధ‌‌ర్వుడు దివంగ‌త ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి ప‌ద్మ‌విభూష‌ణ్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు. నిన్న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దివంగ‌త ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి ప‌ద్మ‌విభూష‌ణ్ కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు, సినీ ప్ర‌ముఖులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దీనిపై స్పందించారు.

powerstar

Powerstar గాన గంధర్వుడు దివంగ‌త ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారిని ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారానికి ఎంపిక చేయ‌డం ముదామ‌హం అని అన్నారు. చ‌ల‌న‌చిత్ర సంగీత రంగంపై శ్రీ బాలు గారి ముద్ర చెర‌గ‌నిద‌ని.. మ‌ర‌ణానంత‌రం ఈ పుర‌స్కారానికి ఎంపిక చేయ‌డం ఆయ‌న కీర్తిని మ‌రింత పెంచిందని అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే ప్రముఖ గాయ‌ని కె.ఎస్‌. చిత్ర గారిని ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారానికి ఎంపిక చేయ‌డం సంతోక‌రం అని అన్నారు Powerstar. నాలుగు ద‌శాబ్దాలుగా ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు ప‌లు భాష‌ల్లో త‌న గ‌ళంతో శ్రోత‌ల‌ను మైమ‌రిపించార‌ని వివ‌రించారు. అదేవిధంగా ప‌ద్మ అవార్డుల‌కు ఎంపికైన‌ ప్ర‌ముఖ వ‌యోలిన్ విద్వాంసులు శ్రీ అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి గారికి, మృదంగ విద్వాంసులంటే పురుషులే అనుకున్న స‌మ‌యంలో తొలి మ‌హిళ మృదంగ విద్వాంసురాలిగా క‌చేరీలు చేసిన సుమ‌తిగారికి, ఆశావాది ప్ర‌కాశ‌రావు గారికి, క‌న‌క‌రాజు గారికి జ‌న‌సేన త‌ర‌పున శుభాభినంద‌న‌లు తెలియ‌జేశారు Powerstar ప‌వ‌న్‌క‌ళ్యాణ్.