NTR:ఓవ‌ర్ స్పీడ్‌లో తార‌క్ డ్రైవ్‌.. ఫైన్ క‌ట్టి ఒక‌ కోరిక తీర్చమ‌ని అడిగిన అభిమాని

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఒక్కో రీతిలో ఎన్టీఆర్‌పై త‌మ అభిమానం చాటుకుంటూ ఉంటారు ఫ్యాన్స్‌. కొంద‌రు వీరాభిమానుల ఆలోచ‌న‌ల చేష్ట‌లు ఒకింత వింత గొల‌ప‌డ‌మే కాకుండా.. ప్ర‌త్యేకంగా నిలుస్తాయి. తాజాగా ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ ఫైన్ క‌ట్టాడు ఓ వీరాభిమాని. అలాగే దీనికి ఓ చిన్న విన‌తిని తార‌క్ ముందు ఉంచాడు. అస‌లు ఏంటీ ఆ విన‌తి… జ‌రిమాన ఏంటీ? వివ‌రాల్లోకి వెళ్లితే.. NTR ఎన్టీఆర్‌కి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.

ntr car

నెహ్రు ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా ఓవ‌ర్ స్పీడులో వెళుతున్న ఎన్టీఆర్ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్‌కు రూ.1035 జ‌రిమానా విధించారు. కాస్త‌ ఈ విష‌యం వైర‌ల్ కాగా.. ఓ అభిమాని ఆన్‌లైన్‌లో జ‌రిమానా మొత్తాన్ని చెల్లించాడు. దీనిని ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. అలాగే NTR తార‌క్‌కు ఒక ట్విస్ట్ ఇచ్చాడు.. తార‌క్ అన్నా.. నాతో పాటు నా స్నేహితులు కొంత‌మందికి మ‌ల్లికార్జున లేదా భ్ర‌మ‌రాండ థియేట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఇప్పించండి అంటూ ఎన్టీఆర్ ముందు ఓ చిన్న విన్న‌పాన్ని ఉంచాడు. దీంతో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆ అభిమాని ఎవ‌ర‌నే ఆత్రుత అంద‌రిలో మొద‌లైంది. మ‌రి NTR ఎన్టీఆర్ త‌న అభిమాని కోరిక‌ను మ‌న్నిస్తాడా లేదా అనే ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలాఉంటే NTR తార‌క్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌ ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. విడుద‌ల‌కు ఇంకా నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్న‌ట్లు ఇటీవ‌లే రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో NTR ఎన్టీఆర్ కొమురం భీంగా, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తుండ‌గా.. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది.