కొరియన్ రీమేక్‏లో వెంకటేష్?

కొరియన్ భాషకు చెందిన లక్కీ కీ అనే సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ఇటీవల సురేష్ ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే ఈ రీమేక్ సినిమాకు డైరెక్టర్, హీరో ఎవరనేది ప్రకటించలేదు. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

venkatesh corean remake

ఈ సినిమాలో వెంకటేష్ ప్రధాన పాత్రను పోషిస్తారని వార్తలొస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. 2016లో కొరియోషన్ భాషలో విడుదలైన లక్కీ కీ అనే సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని సురేష్ ప్రొడక్షన్స్ భావించింది. గతంలో కొరియన్ సినిమా మిస్ గ్రానీ తెలుగులో ఓ బేబీ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేసింది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.