నేరుగా మరో తెలుగు సినిమాలో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో.. తెలుగులో కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. సూర్య ప్రతి సినిమాతో తమిళంతో పాటు తెలుగులోకి కూడా డబ్ అవుతూ ఉంటుంది. తెలుగులో సూర్య సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం తమిళంలో సూర్య ఒక సినిమా చేస్తుండగా.. మరోవైపు నేరుగా ఒక తెలుగు సినిమాలో సూర్య నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

surya telugu movie

గతంలో రక్తచరిత్ర సినిమాలో సూర్య నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన నటనతో సూర్య ప్రేక్షకులను అలరించాడు. ఆ పాత్రకు గాను సూర్యకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి నేరుగా ఒక తెలుగు సినిమాలో నటించేందుకు సూర్య ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కించనున్న ఒక సినిమాలో బోయపాటి నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి.