‘హ్యాపీ డేస్’ సినిమా రీ రిలీజ్ ప్రొమోషన్ కి హాజరు కాని …..

శేఖర్ కమ్ముల తీసిన ఎన్నో మంచి సినిమాలలో ఎప్పటికి యువత హృదయాలలో నిలిచిపోయే చిత్రం హ్యాపీ డేస్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ్, తమన్నా, రాహుల్, సోనియా దీప్తి తదితరులు నటించారు. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ కొట్టడమే కాకుండా యువత అంతటిని ఆకర్షించింది. ఇంజనీరింగ్ అంటే విద్యార్థులకు ప్యాషన్ లా మార్చిన సినిమా. ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ కొట్టినాయి. అయితే 2007 లో విడుదల అయినా ఈ సినిమా సుమారు 17 సంవత్సరాల తరువాత ఈ నెల 19న రీ రిలీజ్ కానుంది.

సినిమా రీ రిలీసుల ట్రెండ్ బాగా జరుగుతున్న ఈ రోజుల్లో ఆ సినిమాలలో నటించిన వారు పాల్గొంటున్నారు. వారితో పాటుగా సినిమా దఱకులు, నిర్మాతలు కూడా పాల్గోవడం తెలిసినదే. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటులలో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా స్థాయి సినిమాలు కూడా తీశారు. అయితే ఇప్పుడు హ్యాపీ డేస్ సినిమా రీ రిలీజ్ కు వీరు ఎంత వరుకు వచ్చి ప్రమోట్ చేస్తారు అనే ప్రశ్న ప్రేక్షకులలో వచ్చింది. సినిమా ఈ నెల 19న రీ రిలీజ్ కావడం తో ఈ సినిమాకి సంబందించిన వారు బయటకి వచ్చి ప్రమోషన్ చేయకపోవడం విశేషం.