సునీతకు టాలీవుడ్ హీరో పెళ్లి పార్టీ

టాలీవుడ్ టాప్ సింగర్ సునీత ప్రముఖ బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. డిసెంబర్ 26న వీరి పెళ్లి నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కరోనా క్రమంలో కొంతమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ హోటల్‌లో రామ్-సునీత ఒక్కటి కానున్నారు.

SUNITHA

ఈ క్రమంలో సునీత-రామ్ దంపతులకు టాలీవుడ్ హీరో నితిన్ పార్టీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్‌లో వీరికి పార్టీ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పార్టీకి హాజరైనట్లు సమాచారం. సుమ, రేణు దేశాయ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారట.

త్వరలో జరగనున్న వీరి పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. సునీత 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. తర్వాత మనస్పర్థల కారణంగా భర్తకు సునీత విడాకులు ఇచ్చింది.