వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

సంచలనం రేపిన తమిళ ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో రోజుకు విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. భర్త హేమనాథ్ వేధింపుల వల్లే చిత్ర చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. హేమనాథ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో హేమనాథ్ తండ్రి రవిచంద్రన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆత్మహత్యకు ముందే చిత్ర వేధింపులకు గురైందని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసేవారని ఆరోపించారు.

VJ CHITRA

పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడేదని, ఆ తర్వాత నెంబర్ డిలీట్ చేసేదని హేమనాథ్ తండ్రి చెప్పారు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ఆమె ఊగిపోయేదని చెప్పారు. చిత్ర ఏదో విషయం దాస్తుందని, టెన్షన్ పడుతూ ఉండేదని హేమనాథ్ తనకు చెప్పేవాడని రవిచంద్రన్ తెలిపారు. ఆమెను ఎవరో వేధిస్తున్నారని తనకు చెప్పేవాడని, ఇంతలోపే ఇలా అయిందన్నారు

ఆమెను వేధింపులకు గురిచేసినవారు ఎవరో పోలీసులు గుర్తించారని రవిచంద్రన్ డిమాండ్ చేశారు. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని, హేమనాథ్‌ను పెళ్లి చేసుకోవడం ఎవరికో ఇష్టం లేదని, వారే ఈ వేధింపులకు పాల్పడి ఉంటారని రవిచంద్రన్ ఆరోపించారు.